నూతన సంవత్సర వేడుకల్లో బొకేలు, పూలమొక్కలు, పూల మాలలు, దుశ్శాలువలు బదులు వినూత్న ఆలోచనతో రావాలి.
Publish Date : 30/12/2024
ఏలూరు,డిసెంబర్ 30: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తనను కలిసేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అధికారులు, తదితరులు పూల బొకేలు, మొక్కలు, పూల దండలు, దుశ్శాలువలతో కాకుండా పేద విద్యార్థులకు ఉపకరించే పుస్తకాలు, పెన్నులు వంటివి ఇస్తే మంచిదని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి సూచించారు.
నిండు మనస్సుతో అభిమానంతో శుభాకాంక్షలు చాలు అని పేర్కొన్నారు. బొకేలు, పూల మాలలు, దుశ్శాలువలు తెచ్చే వారు అదే ఖర్చుతో “చదువుకునే పేద విద్యార్థులకు” ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులు వంటివి వినూత్నంగా అందించాలని సూచించారు.