Close

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం 2 నామినేషన్లు దాఖలు.. ఇంతవరకు మొత్తం 5 నామినేషన్లు దాఖలు..

Publish Date : 06/02/2025

ఏలూరు,ఫిబ్రవరి,6: తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి గురువారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.

ఏలూరు కలెక్టరేట్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వారికి డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన దిడ్ల వీరరాఘవులు, కాకినాడకు చెందిన కాట్రు నాగబాబులు ఒక్కోక్కరు ఒక సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అభ్యర్ధులతో రిటర్నింగ్ అధికారి వారు ప్రమాణం చేయించారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం నాటినుండి ఇప్పటివరకు మొత్తం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.

కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు,ఎన్నికల విభాగం తహసీల్దార్ చల్లన్న దొర తదితరులు ఉన్నారు.