పట్టిసీమలోని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించేందుకు పట్టిసీమ ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి లకు ఆలయ ఈ ఓ, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలు, మంగళవాయిద్యాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
పోలవరం/ఏలూరు, ఫిబ్రవరి, 17 : పట్టిసీమలోని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించేందుకు పట్టిసీమ ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి లకు
ఆలయ ఈ ఓ, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలు, మంగళవాయిద్యాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లకు అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి, కలెక్టర్, జేసీ లకు దుశ్శాలువాతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని,. తీర్ధ, ప్రసాదాలను అర్చకులు అందించారు.
జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వెంకటరమణ, డిపిఓ అనురాధ, డీ ఎస్పీ వెంకటేశ్వరరావు, ఆలయధర్మకర్త మండలి చైర్మన్ కుంచనచర్ల జగన్నాధరావు, ఆలయ కమిటీ సభ్యులు వీరభద్రరావు, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ రంగారావు, ఆలయ ఈఓ చాగంటి సురేష్, సర్పంచ్ శ్రీరామమూర్తి, తహసీల్దార్ , ఎంపిడిఓ, ప్రభృతులు పాల్గొన్నారు.