Close

పత్రికలలో ప్రచురించడబడిన ప్రతికూల వార్తాంశాలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Publish Date : 07/11/2025

ఏలూరు, నవంబర్, 7 : పత్రికలలో ప్రచురించడబడిన ప్రతికూల వార్తాంశాలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పత్రికలలో ప్రచురించబడిన ప్రతికూల వార్తాంశాల పరిష్కార చర్యలపై జిల్లా అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, శాఖల కార్యకలాపాలపై ప్రతీరోజు వివిధ దినపత్రికలలో ప్రచురించిన ప్రతికూల వార్తాంశాలను జిల్లా అధికారుల పరిశీలన నిమిత్తం వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతున్నదని, వాటిని పరిశీలించి, సదరు వార్తాంశం పై క్షేత్రస్థాయిలో పరిశీలించి, తీసుకున్న చర్యలను, స్పందనను సమర్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతికూల వార్తాంశాలపై తీసుకున్న చర్యలపై అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా అధికారులు ప్రతికూల వార్తాంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి స్పందన చర్యలు తీసుకుని, పరిష్కార చర్యలు సదరు దినపత్రికలో ప్రచురించబడేలా అధికారులు చూడాలన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, డిపిఓ కె. అనురాధ, ట్రాన్స్కో ఎస్ఈ సాల్మన్ రాజు, డిఈ ఓ వెంకటలక్ష్మమ్మ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాధ్ బాబు, డిఎంహెచ్ఓ డా. అమృతం, డిటిసి షేక్ కరీం , ప్రభృతులు పాల్గొన్నారు.