పనులు వేగవంతంగా పూర్తి చెయ్యాలని జూమ్ మీట్ ద్వారా అధికారులను ఆదేశించినజిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరు, ఫిబ్రవరి 23: జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబరు నుండి సోమవారం పంచాయితీ రాజ్ శాఖ ద్వారా చేపట్టిన పనులు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించి వేగవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా పరిధిలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా వివిధ పథకాలు క్రింద చేపట్టిన పనులపై శాఖలు వారీగా సమీక్షించి తక్షణం పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగు విభాగం పరిధిలో 2024-25 లో చేపట్టిన మొత్తం 1576 పనులు రూ 176 కోట్లుతో మంజూరు కాగా రూ 89 కోట్ల రూపాయలతో 1389 పనులను పూర్తి చేయగా మిగిలినవి పురోగతిలో ఉన్నాయని పంచాయతీ రాజ్ యస్ఇ జిల్లా కలెక్టరుకు వివరించారు. 2025-26 సంవత్సరంలో సీసీ, బిటి, మెటల్ రహదారులు 667 పనులకు గాను రూ 135 కోట్ల రూపాయలతో చేపట్టగా ఇప్పటి వరకు 46 పనులు పూర్తిచేసి రూ 12 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మార్చి 15 నాటికి పురోగతిలో ఉన్న పనులు అన్నింటిని పూర్తిచేసి వాటికి సంబంధించిన బిల్స్ ఆన్లైన్లో అప్లోడ్ చెయ్యాలని అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న రహదారులు పనుల పురోగతిపై మండలు వారీగా సమీక్షించి పనులను వేగవంతం చేసి రోజువారి నివేదికలను సమర్పించాలన్నారు. అధికారులను లక్ష్యసాధనలో నిర్లక్ష్యం వస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తదుపరి సమీక్ష నాటికి రోజువారి పనులకు సంబంధించి బిల్స్ అప్లోడ్ చెయ్యాలని సూచించారు. జిల్లాలో నీటి నిర్వహణ సంస్థ ద్వారా ( MGNREGS ) మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఈ ఏడాది చేపట్టిన రూ 103 లక్షలతో చేపట్టిన వాటర్‌షెడ్లు నిర్వహణతో పాటు వివిధ పనులనుకు సంబంధించి రూ 93.64 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని డ్వామా పిడి కె.వెంకట సుబ్బారావు జిల్లా కలెక్టరుకు వివరించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులు పురోగతిపై రోజువారి ఫోటోలు నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు. అధికారులు పనులను సమయపాలనతో నాణ్యత ప్రమాణాలకు లోబడేలా పూర్తిచేయాలని సూచించారు. గ్రామీణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి, రహదారుల మెరుగుదల, పారిశుధ్యం మరియు సంక్షేమ రంగాలు బలోపేతం ఈ పథకాల ప్రధాన లక్ష్యం అని జిల్లా కలెక్టరు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగు అధికారి జెడ్. రమేష్, డ్వామా పిడి కె.వెంకట సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.