పల్స్ పోలియో కార్యక్రమంపై గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలు నిర్వహించాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …
ఏలూరు, జూన్ 17: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం పల్స్‌పోలియోపై టాస్క్ ఫోర్స్ జిల్లా స్థాయీ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖలు అధికారులు సమన్వయం తో పనిచేసి విజయవంతం చెయ్యాలని అన్నారు. ఇందుకు పటిష్టమైన ఏర్పాట్లు చెయ్యాలని అన్నారు. జిల్లాలో 0-5 సంవత్సరాలు వయస్సు కల గల 2,00,073 పిల్లలకు పోలియో చుక్కలు వేయవలసి ఉందన్నారు. 1,094 పోలియో బూత్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, రూరల్ 799, ట్రైబల్ ఏరియాలో 181, అర్బన్ 114, ట్రాన్సిట్ బూత్ లు 46, మొబైల్ టీమ్ లు 80 ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు 4,814 మంది ఉద్యోగులకు విధులు కేటాయించడం జరిగిందన్నారు. 14,026 వైల్స్, 2,79,861 డోసులు సిద్ధం చేశామని తెలిపారు. ఆరోజు ఏ కారణం చేత అయినా తల్లి,దండ్రులు పిల్లలకు పోలియో చుక్కలు వేయించకపోతే సిబ్బంది ఈనెల 29,30 తేదీల్లో ఇంటింటికి వెళ్ళి పిల్లలను గుర్తించి పోలియో వ్యాక్సిన్ అందించాలన్నారు. మూడు రోజలుపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో నూరుశాతం శాతం లక్ష్యాలను సాధించేందుకు వీలుగా ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమం జరిగే మూడు రోజులు జిల్లాలో ఎక్కడా కూడా విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. వలస కూలీలు, అసంఘిటిత కార్మికులు పిల్లలుపై దృష్టి పెట్టాలన్నారు. ఊరు చివరిన గుడారాలు వేసుకున్న కుటుంబాలు పిల్లలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బస్సు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, తదితర ప్రాంతాల్లో పల్స్ పోలియో శిబిరాలు ఏర్పాటుచేసి పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. ఈ కార్యక్రమాలు వద్ద చల్లని మంచినీటిని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామ, మండలం, డివిజన్, జిల్లా స్థాయిలో అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ అవగాహన ర్యాలీలో అన్ని శాఖలు అధికారులు భాగస్వాములు కావాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంపై రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో అనౌన్స్మెంట్ల ద్వారా ప్రచారం చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్తు సిఇవో పి.జగదాంబ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.యుశోభ, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.యస్. పద్మావతి, డీసీహెచ్ఎస్ డా.సి.హెచ్. బేబికమల, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జెడి వై. విశ్వమోహన్ రెడ్డి, జిల్లా ప్రజా రవాణాధికారి యస్.కె.షబ్నమ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి సి.హెచ్.సూర్యచక్రవేణి, డీపీవో జి.మల్లిఖార్జున రావు, జిల్లా పరిశ్రమలు కేంద్రం జియం ఆర్.వెంకట రావు, జిల్లా సంబంధిత వివిధ శాఖలు అధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.