పింఛన్ల పంపిణీ పరిశీలించి, పలువురుకు పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) .

ఏలూరు,సెప్టెంబరు 01: ఏలూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డు,రామకృష్ణాపురం లో సోమవారం ఎన్.టి.ఆర్. భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తో కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పరిశీలించి నేరుగా పలువురు లబ్దిదారుల ఇంటివద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీచేశారు.పింఛన్లు దారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఇంటివద్దకే వచ్చి పెన్షన్లు అందజేయడంపట్ల లబ్దిదారులు తమ సంతోషం వ్యక్తంచేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్వాంగులు, వ్యాధిగ్రస్ధులకు ప్రభుత్వం పింఛన్లను పెద్దమొత్తంలో పెంచి అండగా నిలిచిందని లబ్దిదారులకు వివరించారు.సోమవారం మధ్యాహ్నం 12 గంటలకే మొత్తం 2,61,221 మంది లబ్ధిదారులకు గాను 2,14,672 మందికి రూ 93 కోట్లు (82 శాతం) పింఛన్లు అందజేసారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు
కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ సెప్టెంబరు మాసపు ఎన్.టి.ఆర్. భరోసా పించన్లు అందించే క్రమంలో జిల్లాలో ఉన్న 2,61,221 మంది పించను దారులకు ప్రభుత్వం రూ.114.13 కోట్లు విడుదల చేసిందన్నారు. సెప్టెంబరు 1వ తేదీన పింఛన్లు ఏదైనా కారణం చేత తీసుకోని వారికి సెప్టెంబరు 02వ తేదీ మంగళవారం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,484 మంది సచివాలయం ఉద్యోగులు మరో సుమారు 791 మంది ప్రభుత్వ ఉద్యోగులతో కలిపి 5,275 మంది సిబ్బంది పింఛన్లు పంపిణీ పాల్గొన్నారని తెలిపారు. తొలి రోజే 90 శాతం పైగా పింఛన్లు అందించుటకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలిరోజు నుంచి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ లు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ విషయంలో వెనుక అడుగు వెయ్యకుండా సంక్షేమ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. ప్రతి నెల పెన్షన్ 01 వ తేదీన అందించడమే కాకుండా ఒకవేళ ఆరోజు సెలవు దినం అయితే ముందు రోజు పెన్షన్లు పంపిణీ నిర్వహించడం జరుగుతుందన్నారు.పేదల ముఖంలో చిరునవ్వు చూడాలని వారి ఆర్థిక ఇబ్బందులు గట్టేక్కించాలనే ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వితంతు, వృద్ధాప్య, దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఉండేలా ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ మొత్తాన్ని సకాలంలో వారికి అందించి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతకు ఇది మచ్చుతునక అన్నారు. ఏలూరు నగరంలో 79 సచివాలయ పరిధిలో 498 మంది సిబ్బంది 28,121 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
వీరి వెంట నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు,ఈడా చైర్మన్ పెద్ది పోయిన శివప్రసాద్, నగరపాలక సంస్థ కో ఆప్షన్ మెంబర్ యస్.యం. ఆర్.పెదబాబు, కార్పొరేటరు జి.ఆదిలక్ష్మి ప్రసాద్,డిఆర్డిఏ పిడి ఆర్.విజయరాజు, మున్సిపల్ కమిషనర్ ఏ.భానుప్రతాప్, తహశీల్దారు గాయిత్రీ, ఆర్.యన్.ఆర్. నాగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.