Close

పిజిఆర్ఎస్ అర్జీలకు నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు ఆదేశించారు .

Publish Date : 07/04/2025

ఏలూరు:ఏప్రియల్ 07, సోమవారం జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్థ ( మీకోసం ) కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్,జిల్లా కలెక్టరు కార్యాలయం ఏవో యన్.వి. నాంచారయ్య, వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా జిల్లా వివిధ మండలాలు నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వివిధ శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలు పరిశీలించి నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.పి జి ఆర్ ఎస్ ద్వారా వచ్చిన అర్జీలను సమర్థవంతంగా పరిష్కరించి నట్లయితే,అదే పిర్యాదు మరల రాదని సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు అన్నారు.

ఈ రోజు పిజిఆర్ యస్ ద్వారా ప్రజలు నుండి 333 ధరఖాస్తులు అందాయని, వీటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.

@ పెదవేగి మండలం రామశింగవరం గ్రామ నివాసి. దేవరపల్లి శ్రేయస్సి తండ్రి జోజిబాబు.పుట్టుకతో దివ్యాంగురాలు సదరన్ సర్టిఫికెటు ఇప్పించి పెన్షన్ మంజూరు చెయ్యాలని కోరారు.

@ బుట్టాయగూడెం మండలం దొరమామిడి గ్రామ నివాసులు. సప్పా మణికంఠ, కాగిత ప్రదీప్ లు.మా గ్రామం ప్రధాన రహదారి ఆక్రమణకు గురైంది.విచారణ చేసి మాకు రహదారి నిర్మాణం చేసి ప్రజలకు వాడుకలోకి తీసుకురావాలని కోరారు.

@ ముసునూరు మండలం గోగులంపాడు గ్రామ నివాసి. నున్నా శ్రీనివాసరావు.నాకు వృద్ధాప్య పింఛను మంజూరు చెయ్యండి.నిరుపేదను బ్రతుకుటకు ధారి చూపించండి.

@ ద్వారతిరుమల మండలం పి.కన్నాపురం గ్రామ నివాసి. పి.భోగేశ్వర రావు.మా గ్రామంలో కనీస సదుపాయాలు కల్పించి,మా గ్రామ ప్రజల కష్టాలు తీర్చాలని కోరారు.

ఈ సమావేశంలో ఆర్డీవో అచ్యుత అంబరీష్,డియల్డివో ఏ.బి.పి.వి.లక్ష్మీ, జిల్లా కలెక్టరు కార్యాలయం ఏవో యన్.వి. నాంచారయ్య,వివిధ శాఖల అధికారులు,రెవిన్యూ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.