Close

పిజిఆర్ఎస్ అర్జీలను నాణ్యతతో నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలి-జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి

Publish Date : 16/06/2025

ఏలూరు, జూన్, 16: పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలను నాణ్యతతో నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌ గోదావరి సమావేశం మందిరంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పిజిఆర్ఎస్) కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ వారి తో పాటు జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, డీఆర్‌డీఏ పీడీ అర్.విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు కె.భాస్కర్, దేవకిదేవి, వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా అందిన దరఖాస్తులకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. నిబంధనల మేర ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులను అందుకు గల కారణాలను స్పష్టంగా ధరఖాస్తుదారుడికి తెలియజేయాలన్నారు.
ఈ సందర్భంగా వచ్చిన అర్జీలలో వచ్చిన కొన్ని…
జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట కు చెందిన రాచర్ల విజయకుమారి తన దరఖాస్తులో షెక్ మస్తాన్ అనే వ్యక్తి తనకు కువైట్ లో ఉద్యోగం ఇస్తానని చెప్పి 2. 50 లక్షల రూపాయలు తీసుకున్నాడని, ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు.
ఏలూరు పడమరవీధికి చెందిన కొలపల్లి జయరామచందు తన దరఖాస్తులో తన గృహం పక్కన శిధిలావస్థలో ఉన్న గృహం ఉన్నదని , పిచ్చిమొక్కలు మొలిచి పాములకు ఆవాసంగా మారిందని, పరిసర గృహాలోకి పాములు వచ్చుచున్న కారణంగా వారు భయభ్రాంతులు గురవుతున్నారని, తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు.
దెందులూరు మండలం కొవ్వలి కి చెందిన గొరిపర్తి కొండలరావు తన దరఖాస్తులో తనకు టెంపరరీ సదరం సర్టిఫికెట్ జారీ చేసారని, పర్మినెంట్ సర్టిఫికెట్ జారీ చేసి సామజిక పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరారు.
పెదవేగికి చెందిన తొంటా తాతయ్య తన అర్జీలో పెదవేగి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని, టాయిలెట్ సౌకర్యం కల్పించాల్సిందిగా కోరారు.
పెదవేగికి చెందిన బొల్లికొండ శ్రీనివాసరావు తన అర్జీలో పెదవేగి పి హెచ్ సి ఆవరణలో ఉన్న భూమి సుమారు 60 సెంట్లు ఆక్రమణలకు గురి అయిందని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.
ఉంగుటూరు మండలం ఎర్రమిల్లిపాడు గ్రామానికి చెందిన చిలుకూరి సాయిబాబు తన అర్జీలో తనకు గున్నంపల్లిలో తనకు గల 17 సెంట్లు, 83 సెంట్ల భూములకు సర్వే చేసి ఆన్లైన్ చేయవలసిందిగా కోరారు.
లింగపాలెం మండలం ధర్మాజీగూడెం నకు చెందిన గారపాటి వెంకట సుబ్బారావు తాను పక్షవాతంతో బాధపడుతున్నానని, తనకు ప్రస్తుతం వృద్ధాప్యపు పెన్షన్ 4 వేల రూపాయలు వస్తున్నదని, సదరం సర్టిటిఫికేట్ జారీ చేసి, దీర్ఘకాలిక రోగులకు మంజూరు చేసే పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరారు.
పెదవేగి మండలం కూచింపూడి గ్రామానికి చెందిన నిట్ఠా కృష్ణ తన అర్జీలో తన తండ్రి వైమానికదళంలో పనిచేసిన సమయంలో 5 ఎకరాలు ప్రభుత్వం మంజూరు చేసిందని, సదరు పొలమును సర్వే చేసి ఆన్లైన్ చేయవలసిందిగా కోరారు.

సంబంధిత శాఖల అధికారులు అర్జీలను పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.