• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారం అర్ధవంతంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

Publish Date : 30/06/2025

ఏలూరు,జూన్,30: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో(పిజిఆర్ఎస్) లో అందిన అర్జీల పరిష్కారం నాణ్యతతో అర్ధవంతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొని ప్రజల నుంచి 302 అర్జీలను స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా కలెక్టర్ వారితో పాటు జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, ఏస్సీ కార్పోరేషన్ ఈడి ఎం. ముక్కంటి ఉన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో అర్జీదారులను నుండి స్వీకరించిన ప్రతి అర్జీ పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టి బాధ్యతతో పనిచేయాలన్నారు. అందిన అర్జీల పరిష్కారతీరు నాణ్యతతో ఉండాలని, రీఓపెనింగ్ అయ్యేందుకు ఆస్కారం లేకుండా ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. క్షేత్రస్ధాయిలో పర్యటించి అర్జీలు అర్ధవంతంగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.

అందిన అర్జీలలో కొన్ని..
చింతలపూడి మండలం అల్లిపల్లి గ్రామానికి చెందిన చక్రపు విజయ అర్జీనిస్తూ దస్తావేజులో పేరు తప్పుగా నమోదు కాబడిందని, సదరు పేరు సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉంగుటూరు మండలం కాకర్లమూడి తోటరామచంద్రాపురం కు చెందిన యడవల్లి జగ్గయ్య అర్జీనిస్తూ వ్యవసాయ భూమిపక్కన చెరువులు త్రవ్వడం వల్ల వారు ఎటువంటి బోదులు త్రవ్వకుండా ఆ చెరువుల నీరు తమ పొలాల్లోకి వచ్చి పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఈ సమస్యకు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం కు చెందిన కె. సత్యనారాయణరెడ్డి అర్జీనిస్తూ రద్దుపరిచిన వీలునామాపై చేసిన మ్యూటేషన్ రద్దుపరిచి సాగుచేస్తున్న తమ భూమికి మ్యూటేషన్ చేయాలని కోరారు. పోలవరంకు చెందిన బత్తుల రత్నకుమార్ అర్జీనిస్తూ విద్యుత్ ఘాతంతో పాడిగెదే చనిపోయిన కారణంగా విద్యుత్ శాఖ నుంచి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరారు. ఏలూరుకు చెందిన మహ్మద్ అబ్దుల్ అజీమ్ ఎం.ఎ.కె.ఎ. ఉర్ధూ మీడియం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న దృష్ట్యా వెంటనే టీచర్లను నియమించాలని కోరారు. టి. నర్సాపురం కు చెందిన ఎ. విజయలక్ష్మి అర్జినీస్తూ టి. నర్సాపురం నుండి బొర్రంపాలెం వెళ్లే రహదారిలో ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.