పిజిఆర్ఎస్ లో అర్జీ పరిష్కారంపై అధికారులకు అభినందనలు తెలిపిన అర్జీదారులు.
ఏలూరు,ఏప్రిల్, 28 : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్య పరిష్కారం కావడంపై అశోక్ నగర్ కు చెందిన శేఖర్ నగర్, రెసిడెన్సీయల్ వెల్ఫేర్ అసోషియేషన్ సభ్యులు జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. సదరు అభినందనలు తెలుపుతూ అసోషియేషన్ జాయింట్ సెక్రటరీ, కరస్పాండెంట్ అంబికా సుబ్బారావు సోమవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వికి లేఖను అందజేశారు. శేఖర్ నగర్ లో శ్రీ వీరమాచనేని కళ్యాణ మండపం రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణకు, ప్రమాధాల నియంత్రణకు, యువత మోటార్ సైకిళ్లుతో సవారీలు, స్టంట్లు నివారించడానికి ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్ధలో అర్జీని అందజేశామని సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు అడిగిన వెంటనే 5 రోజుల్లో ట్రాఫిక్ నియంత్రణకొరకు స్పీడ్ బ్రేకర్లు యుద్ధప్రాతిపధికన ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్ధ, డిఎస్పీలకు తమ అసోషియేషన్ తరపున సమిష్టిగా, ఐక్యంగా ముక్తకంఠంతో ప్రశంసలు, అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అంకితభావం, చిత్తశుద్ధి, సేవాభావం ఉద్యోగధర్మం కలిగిన అధికారులు ఏలూరు లో పనిచేయడం ఏలూరు ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని అసోషియేషన్ ప్రెసిడెంట్ కె. ప్రసన్న కూమారి, గౌ. ప్రెసిడెంట్ ఎస్. సాంబశివరావు, సహాయ కార్యదర్శి అంబికా సుబ్బారావు తెలియజేశారు.
