• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

పిజిఆర్ యస్ లో వచ్చిన అర్జీలు 253. అర్జీలు రీ-ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి. జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి .

Publish Date : 01/09/2025

ఏలూరు,సెప్టెంబరు 01:జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, యస్ డిసి కె.భాస్కర్, జెడ్పీ సిఈవో యం.శ్రీహరి, డిఆర్డీఏ పిడి ఆర్.విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి యం.ముక్కంటి, సర్వే సహాయ సంచాలకులు అన్సారీ, నగరపాలక కార్పొరేషన్ కమీషనరు ఏ.భాను ప్రతాప్ లు అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేసి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా పరిష్కార చర్యలు తీసుకోవాలని అన్నారు. కొన్ని సందర్భాల్లో ఫిర్యాదులు పరిష్కారానికి కొంత సమయం అవసరం ఉన్నప్పుడు సంబంధిత విషయాన్ని ఫిర్యాదు దారులతో అధికారులు మాట్లాడితే వారికి కొంత ఊరట కలుగుతుందన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు ఎండార్సు చేసి పంపాలని,కాలయాపన చేస్తే ఫిర్యాదుదారులు అసంతృప్తి చెందుతారని ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అర్జీలు రీ-ఓపెన్ కాకుండా సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ రోజు వచ్చిన అర్జీలలో కొన్ని.

చింతలపూడి మండలం యర్రగుంటపల్లికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ నా భూమికి సర్వే చేశారని, సర్వే కాఫీ ఇవ్వలేదని ఇప్పించాలని అర్జీని ఇచ్చారు, కలిదిండి మండలం కోడంగి చెందిన నిమ్మకాయల శ్రీనివాసరావు మా గ్రామ నాలువ వార్డు డ్రైను సౌకర్యం కల్పించాలని చాలా ఇబ్బందులు పడుతున్నామని పరిష్కారం చూపాలన్నారు, ఏలూరు మండలం సత్రంపాడుకు చెందిన చిలకమర్రి భార్గవి తల్లి,తండ్రులు లేరని, కష్టకాలంలో బియస్సి పూర్తి చేశానని ప్రస్తుతం బంధువుల ఇంట్లో ఆశ్రమం పొందుతున్నానని నాకు ఉపాధి కల్పించాలని కోరారు, ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన పసుమర్తి కోటయ్య మాజీ సైనిక ఉద్యోగి మా సంపూర్ణ స్వాధీన హక్కు భక్తములలో గల వ్యవసాయ సాగు భూమిని నిషేధిత భూముల జాబితా 22 ఏ నుండి తొలగించుట కు ఉత్తర్వులు ఇప్పించ వలసినదిగా వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు,జిల్లా కలెక్టరేటు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.