పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యానికి మొదటి ఆరు సంవత్సరాలలో అందించే పోషకాహారమే ప్రధానమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. పోషణ అభియాన్ లో భాగంగా 8వ విడత పోషణ పక్వాడ పోస్టర్ ను కలెక్టర్ గురువారం కలెక్టరేట్ లో ఆవిష్కరించారు.
ఏలూరు, ఏప్రిల్, 9 : పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యానికి మొదటి ఆరు సంవత్సరాలలో అందించే పోషకాహారమే ప్రధానమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. పోషణ అభియాన్ లో భాగంగా 8వ విడత పోషణ పక్వాడ పోస్టర్ ను కలెక్టర్ గురువారం కలెక్టరేట్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పోషకాహార ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్న పిల్లల్లో పోషకాహార లోపాన్ని పోగొట్టేందుకు పూర్తిస్థాయిలో పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోషకాహార ప్రాధాన్యతపై ఈ సంవత్సరం పోషణ పక్వాడను ఏప్రిల్ 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కార్యక్రమం ప్రధానంగా “మొదటి 6 సంవత్సరాల జీవన కాలంలో సమగ్ర అభివృద్ధి” అనే అంశంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి అవగాహన కలిగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లి మరియు శిశు పోషణ, 0-3 సంవత్సరాల పిల్లల మానసిక అభివృద్ధి, 3-6 సంవత్సరాల పిల్లల ప్రాథమిక విద్య , స్క్రీన్ టైమ్ తగ్గించడం తల్లిదండ్రుల పాత్ర, అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి సమాజ భాగస్వామ్యం అనే అంశాలపై అవగాహన కలిగిస్తున్నామని, ప్రధాన థీమ్స్ మరియు కార్యకలాపాలలో మొదటి 1000 రోజులు లో “సుపోషిత జనని – స్వస్థ శిశు” కార్యక్రమం, “సూపర్ డ్యాడ్” రెసిపీ పోటీలు, తల్లి తండ్రుల భాగస్వామ్యంపై అవగాహన వర్క్‌షాపులు
థీమ్ 2: పోషిత భారత్ – జంక్ ఫుడ్ ఫ్రీ కమ్యూనిటీ , “నుక్కడ్ నాటక్” ద్వారా అవగాహన కార్యక్రమాలు, “స్వాప్ ది స్నాక్” ప్రదర్శనలు
ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై ప్రచారం , థీమ్ 3: ప్రాథమిక విద్య మరియు వృద్ధి (3-6 సంవత్సరాలు), “ఖేల్ సే సీక్” కార్నివాల్
“టాయ్-అ-థాన్” కార్యక్రమం, తండ్రులతో కథా విన్యాసం కార్యక్రమాలు, థీమ్ 1: గోల్డెన్ విండో అదనంగా, సోషల్ మీడియా ద్వారా అవగాహన సందేశాలు, డ్రాయింగ్ పోటీలు, కమ్యూనిటీ ఈవెంట్లు నిర్వహించబడతాయన్నారు. పోషణ పక్వాడ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి ప్రతి కుటుంబానికి పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ప్రజలు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. శారద, నోడల్ అధికారి మరియు డి.యం.సి. ఇ. తులసి, సిడిపిఓ. ఎ. పద్మావతి, ఇ.ఓ., జె.వి. రమణ, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ కె.కామేశ్వరరావు, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ కె. శ్రీలత తదితరులు పాల్గొన్నారు.