Close

పీఎం ఆదర్శ్ గ్రామ యోజన, ఆది కర్మయోగి అభియాన్ రెండవ దశలో గ్రామ అభివృద్ధి ప్రణాళికలను వెంటనే పూర్తిచేయాలి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష

Publish Date : 13/10/2025

ఏలూరు, అక్టోబర్, 13 : ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన లో ఆయా గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలపై గ్రామ అభివృద్ధి ప్రణాళికలను వెంటనే రూపొందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి సోమవారం పీఎం ఆదర్శ్ గ్రామ యోజన, ఆది కర్మయోగి అభియాన్ రెండవ దశ గ్రామ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి ప్రతిపాదనల రూపకల్పన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా రెండవ దశలో ఎంపిక చేసిన 31 గిరిజన గ్రామాలలో మౌలిక సదుపాయాలకల్పనపై విజన్ యాక్షన్ ప్లాన్ లు పూర్తిచేసి గ్రామ సభలు నిర్వహించి ఆమోదానికి చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ఐటిడిఏ పి ఓ రాములు నాయక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.