పీజిఆర్ ఎస్ ద్వారా అందిన విజ్ఞప్తులు రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.
Publish Date : 06/04/2026
ఏలూరు, ఏప్రిల్, 6 : పీజిఆర్ ఎస్ ద్వారా అందిన విజ్ఞప్తులు రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో అందిన అర్జీలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పీజిఆర్ ఎస్ ద్వారా అందిన విజ్ఞప్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలన్నారు.
సోమవారం పీజిఆర్ ఎస్ లో 238 విజ్ఞప్తులు అందాయి.
కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ఓ భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి ఎం. ముక్కంటి, సర్వే శాఖ ఏడి అన్సారీ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.