Close

పీ4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలను మార్గదర్సకులతో అనుసంధానం చేయాలి రానున్న 10 రోజులు పంచాయతీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి లక్ష్యాలను సాదించాలి

Publish Date : 16/02/2026

ఏలూరు, ఫిబ్రవరి, 16 : జిల్లాలో పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి సోమవారం సాయంత్రం ఆస్థి పన్నులు వసూళ్లు, పీ4, యూనిఫైడ్ ఫామిలీ సర్వే, తదితర అంశాలపై ఎంపిడిఓలు, మునిసిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పన్నుల వసూళ్లు బకాయిలు పేరుకుపోవడంపై అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిర్ణీత గడువులోగా పన్నులు వసూలు చేయని సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఆస్థి, తదితర పన్నులు బకాయిలతో సహా వసూలుకు చర్యలు తీసుకోవాలని, ప్రతీ మండలంలో రోజుకు 10 లక్షల రూపాయలు పన్నుల వసూళ్లను లక్ష్యంగా నిర్ణయించుకుని ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేయాలన్నారు. రానున్న 10 రోజులు పంచాయతీ, పురపాలక సంఘాల సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్ణీత లక్ష్యాలను సాధించాలన్నారు. యూనిఫైడ్ ఫామిలీ సర్వే ని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. సచివాలయ సిబ్బందికి నిర్దేశించిన రోజూ వారీ లక్షయాల మేర సర్వే పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో పీ4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలను మార్గదర్సకులతో అనుసంధానం చేయాలని, జిల్లాలో 71 వేల 910 బంగారు కుటుంబాలకుగాను, ఇంతవరకు 24 వేల 268 కుటుంబాలను మార్గదర్సులతో అనుసంధానం చేయడం జరిగిందని, మిగిలిన 47 వేల 642 కుటుంబాలకు సంబంధించి మార్గదర్సులను గుర్తించి త్వరితగతిన అనుసంధానం చేయాలన్నారు.

జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, జిల్లా పంచాయతీ అధికారి కె. అనురాధ, ఎంపిడిఓ లు, నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల కమిషనర్లు పాల్గొన్నారు.