Close

పీ4 ప్రణాళికలను నియోజకవర్గాలవారీగా రూపొందిస్తాం- సీఎస్ కి తెలియజేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 06/02/2025

ఏలూరు, ఫిబ్రవరి, 6 : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పది సూత్రాలతో సామజిక, ఆర్ధిక సాధికారత, స్థిరమైన అభివృద్ధిని సాధించే దిశలో భాగంగా ఏలూరు జిల్లాలో పీ4 (పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా కార్యాచరణ ప్రణాళికలను నిర్దేశించిన సమయంలోగా రూపొందిస్తామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కు తెలియజేసారు. “స్వర్ణాంధ్ర@ 2047” లక్ష్యసాధనలో భాగంగా పది సూత్రాలతో పీ4 ప్రణాళికల రూపకల్పనపై సెక్రటేరియట్ నుండి గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 10 సూత్రాలతో కూడిన ప్రణాళిక లక్ష్యాలను సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పీ4 (పీపుల్ , పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) కార్యక్రమాన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉగాది రోజున ప్రారంభిస్తారని, ఇందుకు సంబంధించి అసీంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి నిర్దేశించిన సమయంలోగా పంపాలని కలెక్టర్లను కోరారు. ఇందుకోసం నియోజకవర్గ స్థాయిలో నోడల్ అధికారులను నియమించాలని, నోడల్ అధికారితోపాటు 6 గురు సభ్యులతో బృందాలను ఏర్పాటుచేసి, ప్రజల అభిప్రాయాలను సేకరించాలన్నారు. ఎంఎస్ఎంఈ సర్వే ని వేగవంతం చేయాలనీ, సీఎస్ కలెక్టర్లను కోరారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో మాట్లాడుతూ పేదరికాన్ని సమాజం నుండి తరిమివేసి ప్రజల జీవన ప్రమాణాల స్థాయి ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుండి అమలు చేసే పీ4 ప్రణాళికను నిమిత్తం జిల్లాలో నియోజకవర్గాల వారీగా ప్రణాళికలను నిర్దేశించిన సమయంలోగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, డి.ఆర్.డి. ఏ ., ప్రాజెక్ట్ అధికారి విజయరాజు, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాష, సిపిఒ సిహెచ్. వాసుదేవరావు, జిల్లా పంచాయతీ అధికారి అనురాధ, డీఈఓ వెంకట లక్ష్మమ్మ ప్రభృతులు పాల్గొన్నారు.