పునరావాస కేంద్రాలకు అనువుగా భవనాలు పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ..
ఏలూరు/ వేలేరుపాడు, జూలై 31: వేలేరుపాడు మండలం వేలేరుపాడు గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ గిరిజన ఉన్నత బాలికల పాఠశాల, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంతో పాటు దాచారం ఆర్&ఆర్ గిరిజన ఖాళీగా ఉన్న గృహాలను పునరావాస కేంద్రాలకు పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే భాగంగా పునరావాస కేంద్రాలకు అనువైన భవనాలు పరిశీలించామని అన్నారు. ప్రతి పునరావాస కేంద్రంలో జనరేటరు, బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు, గ్యాసు, తగినన్ని నిల్వలు పెట్టుకుని, వరద బాధితులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఇందుకు భవనాలు సామర్థ్యం, తాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, వంటశాల, భద్రత తదితర మౌళిక వసతులుపై పరిశీలించామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఉదయానికి బాధితులను తరలించి, పునరావాస కేంద్రాలు కార్యకలాపాలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. ప్రతి హెబిటేషన్లో, ప్రతి పునరావాస కేంద్రాల్లో అన్నిరకాలు మందులుతో పాటు పాముకాటు విరుగుడు ఇంజన్లుతో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు అధికారులు అప్రమత్తంగా పనిచేస్తూ, క్షేత్రస్థాయిలో మకాం ఉండాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఆర్డీవో యం.వి. రమణ, ఐటిడిఏ పీవో కె.రాములు నాయక్, వివిధ శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.