Close

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను అధ్యయనం చేసిన జలశక్తి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

Publish Date : 11/01/2025

ఏలూరు/పోలవరం, జనవరి, 11 : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను అధ్యయనం చేసేందుకు శనివారం పోలవరం విచ్చేసిన కేంద్ర జలశక్తి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుగా ప్రాజెక్ట్ లోని స్పిల్ వే ని పరిశీలించింది. అనంతరం ఎగువ, దిగువ కాఫర్ డాం పనులను పరిశీలించింది. అనంతరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించింది. అనంతరం డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించి జనవనరుల శాఖ అధికారులను, ప్రాజెక్ట్ ఇంజినీర్ల ను కమిటీ చైర్మన్, సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రదేశాలలో కాంట్రాక్టు ఏజెన్సీ, ప్రాజెక్ట్ ఇంజినీర్లు ప్రాజెక్ట్ పనుల ప్రగతిపై ఏర్పాటుచేసిన ఛాయా చిత్ర ప్రదర్శనలను కమిటీ సభ్యులు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిటీ కి ఆయా ప్రాంతాలలో ప్రాజెక్ట్ పనులకు సంబందించిన వివరాలను జలవనరుల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ వివరించారు.
అంతకుముందు కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూడీ కమిటీ సభ్యులతో కలిసి ప్రాజెక్ట్ సమావేశపు హాలులో పోలవరం ప్రాజెక్ట్ పనులకు పురోగతిపై కాంట్రాక్టు ఏజెన్సీ, ప్రాజెక్ట్ ఇంజినీర్లు, అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ప్రయోజనాలు, పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులు వివరించారు. అదేవిధంగా కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూడీ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలకు జలవనరుల శాఖ అధికారులు నివృత్తి చేశారు. దీనిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి లో నిర్మిస్తున్న గృహనిర్మాణ వివరాలను అధికారులను కమిటీ చైర్మన్ అడిగి తెలుసుకున్నారు.
కమిటీ సభ్యులు రాజ్యసభ సభ్యులు  ఖిరు మహ్తో,  శ్రీమతి ధర్మశీల గుప్తా,  లోక్ సభ సభ్యులు రీ షేర్ సింగ్ ఘుబాయా, రోడ్మల్ నగర్, జోయంత బసుమతరీ, నారాయణ్ దాస్ అహిర్వార్, శ్రీమతి సంజ్ఞ జాతవ్,  సాగర్ ఈశ్వర్ ఖండ్రే,  విశాల్ (దాదా) ప్రకాష్బాపు పాటిల్,  మోహితే-పాటిల్ ధైర్యషీల్ రాజ్‌సిన్హ్ లు ఉన్నారు.
కమిటీ వెంట ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఆర్ అండ్ ఆర్ కమీషనర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు నరసింహ మూర్తి, బి. రాంబాబు లు , పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మెంబెర్ సెక్రటరీ ఎం. రఘురాం, ఏ పి జెన్కో ఎండి కె.వి. ఎన్ . చంద్రశేఖర్, కేంద్ర జలసంఘం మెంబెర్ గోపాల్ సింగ్, మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఎండి సిహెచ్.వి. సుబ్బయ్య, జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఎం. వెంకటేశ్వర రావు, ఆర్డీఓ ఎం.వి. రమణ, ప్రభృతులు పాల్గొన్నారు.