పోలింగు కేంద్రాలు మార్పులు, చేర్పులు ఓటరు అనుకూలతను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పూర్తి నివేదికలు ఇవ్వాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …
ఏలూరు, నవంబరు 19: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం “పోలింగు కేంద్రాలు మార్పులు, చేర్పులు, జిల్లాలో ఖచ్చితత్వం తో కూడిన ఓటర్ల జాబితాపై” సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులతో ఏడు నియోజకవర్గాలు వారీగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఏడు నియోజక వర్గాలలో ఇప్పటికే 1744 పోలింగు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 5 పోలింగు స్టేషన్లు నామకరణం మార్పుకోసం ప్రతిపాదనలు, 23 పోలింగు స్టేషన్లు స్థానమార్పు కోసం ప్రతిపాదనలు, 137 క్రొత్త పోలింగు స్టేషన్లు కొరకు ప్రతిపాదనలు అందాయని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి పోలింగు స్టేషన్లు పరిశీలించి, కొత్తగా ప్రతిపాదించిన పోలింగు స్టేషన్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు, పూర్తి మౌలిక సదుపాయాలను పరిశీలించి, ఓటరుకు అనుకూలంగా ఉందా ? లేదా ఒకటికి నాలుగు సార్లు పరిశీలించి పూర్తిస్థాయిలో నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ నివేదికలను వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు వెరిఫై చేసిన తర్వాత ఆమోదం కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. బియల్ వోలు డోర్ టు డోర్ వెళ్ళి ఖచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చెయ్యాలని అన్నారు. జిల్లాలో వలసలు, ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో ఓటర్లు నమోదు, చనిపోయిన ఓటర్లను తొలగించకపోవడం వంటి అంశాలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటుచేసి, వారి సూచనలు, ఫిర్యాదులను తీసుకోవాలని, వారికి ఉన్న సందేహాలు నివృత్తి చెయ్యాలని అన్నారు. ఎక్కడ కూడా అనుమానాలకు, వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన చెయ్యాలని అన్నారు. 2002 సంవత్సరం నాటి ఓటర్లు 2025 ఓటర్ల జాబితాతో పోల్చి విచారణ జరపాలన్నారు. 2002 సంవత్సరంలో ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదన్నారు. 2004 తర్వాత ఓటర్లుగా నమోదైన వారంతా తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండాలన్నారు.
ఈ ప్రక్రియను వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు భాగస్వామ్యంతోనే చేపట్టాలన్నారు. నూతనంగా ఓటు హక్కు పొందిన యువతకు ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డులు నూటికినూరు శాతం జారీ చెయ్యాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, జంగారెడ్డిగూడెం ఆర్డీవో బి.వి.రమణ, కెఆర్ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర రావు, ఏపి ఐఐసి జోనల్ మేనేజరు కె.బాబ్జీ, జెడ్పీ సిఈవో యం.శ్రీహరి, ఇఆర్వోలు యం.వీర్రాజు, వి.శ్రీనివాసులు రెడ్డి, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు ఏ.రత్నకాంత్ (బహుజన సమాజ్ పార్టీ బియస్ పి), నెరుసు నెలరాజు(బిజెపి), డి.యన్.వి.డి. ప్రసాదు (సిపిఐ (యం), మోరు వెంకట నాగరాజు ( జనసేన), యు. బాలానందం, యస్.అచ్యుత బాబు (టిడిపి), వి.స్టాన్లీబాబు ( వైయస్ఆర్ సిపి), తహశీల్దార్లు, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, డిప్యూటీ తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.