Close

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించారు.

Publish Date : 21/10/2024

ఏలూరు, అక్టోబర్, 21 : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి వి జి అశోక్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు జిల్లా జడ్జి శ్రీ పురుషోత్తం, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి , జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ జాయింట్ కలెక్టర్ పి . ధాత్రి రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎన్ సూర్యచంద్రరావు , డిఎస్పీ శ్రీ డి శ్రావణ్ కుమార్ గారు ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ , ఏ ఆర్ డిఎస్పీ శ్రీహరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
అమరవీరుల సంస్మరణ దినోత్సవం నేపథ్యంలో ఏలూరు పోలీస్ పెరడు గ్రౌండ్ నందు పోలీస్ కవాతుల నిర్వహించి స్మృతి పేరెండును పోలీసు అధికారులు నిర్వహించారు.
దేశంలో నెలకొని ఉన్న ఉగ్రవాదం, తీవ్రవాదం , మతతత్త్వ శక్తులు, అసాంఘిక శక్తుల బారి నుంచి ప్రజలను కాపాడడంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి పోలీస్ అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు.

ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ రోజు రోజుకు పోలీస్ శాఖ విధులు సవాలుగా మారుతుందని కేసులు దర్యాప్తులను ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని అలాంటి వాటిని ఎదుర్కొంటూ అవిశ్రాంతంగా పోరాడుతూ శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు ఎనలేని సేవలు చేస్తూ ప్రాణ త్యాగాలు చేస్తున్నారని అన్నారు అమరవీరుల త్యాగాలను నెమరు వేసుకుంటూ వారి ఆశయ సాధనలో పోలీస్ శాఖ ముందుకు వెళుతూ వారి సేవల స్ఫూర్తితో సేవలు కొనసాగిస్తామన్నారు. 1959 చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతం వద్ద సిఆర్పిఎఫ్ భారత జవాన్లపై చైనా మిలటరీ దళాలు మూకుమ్మడిగా దాడి చేసి పదిమంది జవాన్లను ఓర్సకోత కోశారన్నారు ఆనాటి నుండి అక్టోబర్ 21వ తేదీని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా కొనసాగితే వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. ఏడాది దేశంలో 216 మంది పోలీసులు అమరులయ్యారని మన రాష్ట్రంలో ఇద్దరు అమరులయ్యారని అన్నారు పోలీసుల విధులలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి అవగాహన సదస్సులు విద్యార్థులకు వ్యాచారచన పోటీలు రక్తదాన శిబిరాలు ఈనెల 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ దేశభద్రత ప్రజారక్షణకై పోలీసులు సేవలు త్యాగాలు చిరస్మరణీయమని, నిత్య స్ఫూర్తిదాయకమని అన్నారు.
జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ దేశ రక్షణలో సైన్యం పాత్ర ఎంతో కీలకమైందని నేడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే పోలీసులు తమ విధులను సమర్ధవంతంగా శక్తివంచన లేకుండా నిర్వహించడం వల్లే జీవించగలుగుతున్నామని స్పష్టం చేశారు. అమరులైన పోలీసు వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు వారి సేవలు ఎనలేనివని కొనియాడారు. రోజురోజుకు పెరిగిపోతున్న నేరాలను అదుపు చేయడంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు అంటూ ప్రశంసించారు. ప్రజలు పోలీసుల విధులకు సహకరించాలని సూచించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్త కుమార్ మాట్లాడుతూ పోలీసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ తమ విధులను నిర్వర్తిస్తున్నారని అన్నారు వారి సేవలో వెళ్ళలేనివని కొనియాడారు.

జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ పోలీసు శాఖలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబ సభ్యులను కంటికి రెప్పలా కాపాడుతామని వారి యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆగిరిపల్లి కానిస్టేబుల్ గంధం నరేంద్ర ను అల్లరి ముకలు దాడిలో మరణించిన మనందరి మనసులు కలిచివేసిందని, ఆవేదన కలిగించిందన్నారు. పోలీసు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని వారి సంక్షేమానికి వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు వివిధ జాతీయ బ్యాంకులు ద్వారా పోలీస్ సిబ్బందికి ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరుగుతుందన్నారు గతంలో భీమా మొత్తాన్ని 70 లక్షలు ఉండగా నేడు కోటి రూపాయల వరకు దానిని పెంచడం జరిగిందన్నారు సాధారణ మరణం కూడా ఇన్సూరెన్స్ విభాగంలోకి తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు. దేశం మొత్తం మీద అమరవీరులైన 216 మంది మరల పేర్లను జిల్లా అదనపు ఎస్పి అడ్మిన్ ఎన్.సూర్యచంద్రరావు గారు చదివి వినిపించారు.

అమరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి విచారించి శ్రద్ధాంజలి ఘటించారు. అధికారులందరూ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి అమరులకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. జిల్లా పోలీస్ శాఖ నిర్మించిన అమరుల స్థూపం వద్ద జిల్లా పోలీస్ యంత్రాంగమంతా శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ ఏడాది అనారోగ్యంతో మరణించిన డి నరసింహారావు, ఎస్సై 1321
టి చంద్ర రావు, ఏ ఆర్ హెచ్ సి 1626,
ఎస్ వెంకటేశ్వరరావు ఏ ఆర్ హెచ్ సి 4300
టి వెంకటేశ్వరరావు, పిసి 2676,డి మధు కుమార్, పిసి2539 పోలీసు కుటుంబ సభ్యులకు జ్ఞాపకలను అధికారులు అందజేశారు.

నగరంలోని వివిధ కాలేజీల విద్యార్థులతో పోలీసు అధికారులు సిబ్బంది కలిసి నగరంలో ర్యాలీ నిర్వహించి ఫైర్ స్టేషన్ వద్ద మానవహారం నిర్వహించారు

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రి రెడ్డి అదనపు ఎస్పి ఎన్ సూర్యచంద్రరావు, ఏ ఆర్ అదన ఎస్పి ఎన్ ఎస్ ఎస్ శేఖర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ,, ఎస్.బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు , ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ వై.వి రమణ ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు , డి సి ఆర్ బీ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ , ఏ ఆర్ ఆర్ ఐ పవన్ కుమార్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.