Close

పోషణ్ మహ్ -2026 గోడప్రతులను ఆవిష్కరించిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …

Publish Date : 09/09/2026

ఏలూరు, సెప్టెంబరు 09: జిల్లా కలెక్టరేటు గౌతమీసమావేశ మందిరంలో బుధవారం జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్ మహ్ -2026 గోడప్రతులను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికల్లో పోషక ఆహారంపై అవగాహన పెంపొందించడమే పోషణ్ మహ్-2026 ప్రధాన లక్ష్యమని అన్నారు. సమతుల్య ఆహారం, పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యం, తల్లిపాలు, చిన్నారులు ఆరోగ్యసంరక్షణ వంటి అంశాలుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలు ద్వారా పోషకాహార కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, పోషకాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి అవసరమైన వైద్య, పోషక సహాయం అందించాలని అన్నారు. ప్రతి కుటుంబం పోషకాహారం, ఆరోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పోషణ్ మహ్-2026 సందర్భంగా జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను భాగస్వాములను చెయ్యాలని జిల్లా కలెక్టరు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, ఇంచార్జి డిఆర్వో, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎల్.దేవకీదేవి, ఐసిడిఎస్ పిడి పి.శారద, జిల్లా గృహనిర్మాణ శాఖ పిడి.జి.సత్యనారాయణ, నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాప్, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జి.వి.కె.మల్లిఖార్జునరావు, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మి, నోడల్ అధికారి ఇ.తులసి, సిడిపివో ఏ.పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.