ప్రజల సంతృప్తి మేరకు అధికారులు పనిచేయాలి సంతృప్తిస్ధాయిని మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలి అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి గూగుల్ మీట్ ద్వారా సమీక్ష
ఏలూరు, మే, 19: వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు అందించే సేవలు ప్రజా సంతృప్తి స్ధాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ నుంచి ప్రభుత్వ పాలనలో, ప్రజా సమస్యల పరిష్కారం మరియు సంక్షేమ పథకాల అమలుపై “ప్రజా సంతృప్తి స్థాయి” గురించి సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో, ప్రజా సమస్యల పరిష్కారం మరియు సంక్షేమ పథకాల అమలుపై “ప్రజా సంతృప్తి స్థాయి”) కీలక కొలమానంగా ఉందన్నారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో 80-90 శాతానికి తగ్గకుండా సంతృప్తి స్థాయి సాధించాలని అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో మెరుగైన పారిశుధ్య పరిస్ధితులు ప్రస్పుటం కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధిత మున్సిపల్ కమీషనర్లు తెల్లవారు జామునే ఆయా వార్డుల్లో పర్యటించి పారిశుధ్య సంతృప్తిస్ధాయి పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో అందిన అంశాలను ఆయా గ్రామాల్లో క్షేత్రస్ధాయిలో సంబంధిత పంచాయితీ ఉన్నత అధికారులు పర్యటించి వాస్తవ పరిస్ధితులు తెలుసుకొని వాటిని మెరుగు పరిచేందుకు ఏవిధమైన చర్యలు తీసుకునేది నివేదిక సమర్పించాలన్నారు. పట్టణ, గ్రామాల్లో త్రాగునీటి సరఫరాను పూర్తి నాణ్యత పాటించేలా చర్యలు తీసుకొని ప్రజా సంతృప్తిస్ధాయి మెరుగుపరచాలన్నారు. పంచాయితీరాజ్ విభాగంలో రహదారులకు పడిన గోతులను గుర్తించి వాటిని ప్రాధమిక మరమ్మత్తులు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్బంగా పలు శాఖల ద్వారా అమలవుతున్న ఆయా కార్యక్రమాలు అమల్లో ప్రజా సంతృప్తిస్ధాయిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.