ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 పై అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక నగరపాలక సంస్థ సమావేశపు హాలులో బుధవారం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 పై బిఎల్ఓ లు, అధికారులతో కలెక్
ఏలూరు, జూలై , 1 : ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 పై అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక నగరపాలక సంస్థ సమావేశపు హాలులో బుధవారం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 పై బిఎల్ఓ లు, అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 కార్యక్రమంపై బిఎల్ఓ లు పూర్తి అవగాహన కలిగి నిర్దేశించిన సమయంలోగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 పనులను పూర్తి చేయాలన్నారు. ప్రతి బూత్ లెవెల్ అధికారి , తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి గణన ఫారంను ఓటర్లకు అందజేసి, వారు పూర్తిచేసిన గణన ఫారాలను డిజిటైజేషన్ చేయాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను నూరు శాతం పంపిణీ చేసి 2002 లో ఓటర్ల జాబితాలో ఉన్న పేర్ల ను మ్యాపింగ్ చేయాలన్నారు. వారి ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటైజేషన్ చేయాలన్నారు. అర్హత కలిగిన ప్రతీ పౌరుడు ఓటరు జాబితాలో నమోదు కావడం, అదే సమయంలో అనర్హులైన వ్యక్తుల పేర్లు ఓటరు జాబితాలో చేరకుండా ఉండడం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) యొక్క ప్రధాన ఉద్దేశ్యమన్నారు. పార్టీలకతీతంగా బిఎల్ఓ లు విధులు నిర్వర్తించాలని, ఎన్యూమరేషన్ ఫారాలను, రాజకీయపార్టీల ప్రతినిధులు ఎవరికీ అప్పగించకుండా బిఎల్ఓ లే ప్రతీ ఇంటికి వెళ్లి అందించి, పూర్తిచేసిన తరవాత తిరిగి తీసుకుని, డిజిటైజేషన్ చేయాలన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు.
అనంతరం జిల్లాలోని ఈఆర్ఓ లు, ఏ ఈఆర్ఓ లు, తహశీల్దార్లతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రగతిపై సమీక్షించారు.
కలెక్టర్ వెంట జడ్పి సీఈవో జగదాంబ, అదనపు కమిషనర్ డి. శ్రీనివాసరావు, డిప్యూటీ కమీషనర్ డి. వెంకటలక్ష్మి, తహసీల్దార్ గాయత్రి దేవి, ప్రభృతులు పాల్గొన్నారు.