Close

ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను అధికార్లు మనస్సు పెట్టి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలి. జిల్లా కలెక్టరు కె.వెట్ట్రిసెల్వి .

Publish Date : 06/12/2025

ఏలూరు, డిసెంబరు 06: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం పిజిఆర్ యస్ అర్జీలు, 22ఏ కేసులు, అడంగల్లు, ఇంటి స్థలాలు, రీ సర్వే, ఐవిఆర్ యస్ (రెవెన్యూ యస్ యస్ యల్ ఆర్ ఫ్లైన్ సర్వే & సిసిఆర్ సి పాసుబుక్కు సర్వే), ఆక్రమణలు క్రమబద్ధీకరణ జి.ఓ.నెం. 30 ఆక్రమణలు (వాచ్ డాగ్), యంయస్ యంఇ పార్కులు, లోకాయుక్త, కోర్టు కేసులు (ధిక్కార కేసులు మాత్రమే), సిసిఆర్ సి కార్డులు మొత్తం 12 అంశాలుపై మండలాలు వారీగా సమీక్షించి, ప్రగతిలో వెనుకబడ్డ మండలాలు తహశీల్దార్లుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలో లక్ష్యాలు పూర్తి చెయ్యకపోతే సస్పెండు చేస్తానని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి హెచ్చరించారు.

ఈ సందర్భంగా కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ యస్ అర్జీలు పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని, ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను అధికార్లు మనస్సు పెట్టి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ప్రజలు నుండి అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు అధ్యయనం చేసి ఫిర్యాదు ధారులు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. పిజిఆర్ యస్ అర్జీలు పరిష్కారంపై ఐ.వి.ఆర్. ఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదుదారులు నుండి సేకరించిన స్పందనపై ఫిర్యాదుదారులు సంతృప్తి స్థాయి చాలా తక్కువగా ఉందని, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. కొంతమంది ప్రజా ఫిర్యాదులు పరిష్కారంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫిర్యాదులు పరిష్కారంపై పురోగతి లేకపోతే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, జాయింటు ఎల్పిఎం, మ్యుటేషన్ సంబంధించిన పెండింగు కేసులను విచారణ చేసి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రీ సర్వేలో భాగంగా ఇళ్ల స్థలాలు, పంట పొలాలు సరిహద్దు కొలతల నిర్ధారణలో హెచ్చుతగ్గులపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి ఇటువంటి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రెవెన్యూ అంశాల ప్రగతిపై కూడా ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని, ఆర్డీవోలు, తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, ఏలూరు ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, జంగారెడ్డిగూడెం ఆర్డీవో యం.వి.రమణ, డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవి, సర్వే ఏడి అన్సారీ, జిల్లా కలెక్టరేటు ఏవో యన్.వి.నాంచారయ్య, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితరులు పాల్గొన్నారు.