ప్రభుత్వ వైద్యులు మంచి వైద్యసేవలు అందించి రోగులలో నమ్మకాన్ని పెంపొందించు కోవాలి. కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …
ఏలూరు/కైకలూరు, ఏప్రియల్ 25: కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జనరల్ ఓపి, రక్త పరీక్ష గది, ఎముకల ఓపి, ఓపీ రిజిస్ట్రేషన్, స్త్రీలు వార్డు, పురుషులు వార్డు, బ్లడ్ బ్యాంకు, తదితర వార్డులు పరిశీలించి పేషెంట్లు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్యసేవలుపై అభిప్రాయాలు తెలుసుకుని, జిల్లా కలెక్టరు సంతృప్తిని వ్యక్తం చేశారు. 50 పడకల హాస్పటల్ పనిచేసే వారి వివరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటరు ప్రగతి సూచిక బోర్డులను పరిశీలించి వివరాలను జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యులు మంచి వైద్యసేవలు అందించి రోగులలో నమ్మకాన్ని పెంపొందించు కోవాలని అన్నారు. నిరుపేద రోగులు ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్ళకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ లో మంచి సర్వీసులు అందించాలని సూచించారు. అన్ని డెలివరీలు ప్రభుత్వ హాస్పిటల్ లో జరగాలని, సుఖప్రసవాలకు మొదటి ప్రాధాన్యను ఇవ్వాలని అన్నారు. అనారోగ్య కారణాలతో అప్పులు బారిన పడి కుటుంబాలు ఆర్థికంగా కృంగిపోకుండా సమాజంలో నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా, సంతోషంగా జీవించాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ప్రభుత్వ నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ లో స్నేహ పూర్వకమైన వైద్యసేవలు అందించి అందరీ మన్ననలు పొందాలన్నారు.
మన దగ్గరకు వచ్చిన కేసులను వేరే హాస్పటల్ కు పంపించకుండా మన హాస్పిటల్ లో పూర్తి వైద్యసేవలు అందించి వారిని తిరిగి చిరునవ్వుతో ఇంటికి పంపించాలన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండి, హాస్పటల్లో సమయపాలన పాటించాలని అప్పుడే ప్రజలకు మన వైద్యసేవలు పట్ల నమ్మకం, గౌరవం కలుగుతుందన్నారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు పేషెంట్ల సంఖ్య పెరుగుతుందని అన్నారు. హాస్పిటల్ లో స్కానింగు సెంటరు రేడియాలజిస్ట్ పోస్టు, ఒక వైద్యుని పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటానని అన్నారు.
ఈ తనిఖీలో ఇంచార్జి ఆర్డీవో ఐ.కిషోరు, హాస్పిటల్ సూపర్డెంటు డా.కె.శ్వేత, వైద్యులు, ఏఎన్ యంలు, వైద్యసిబ్బంది, పేషెంట్లు
వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.