ప్రస్తుత సాగు సీజన్లో ఎరువుల పంపిణీపై పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ప్రతినిధులకు సూచించారు.
ఏలూరు, మే, 25 : ప్రస్తుత సాగు సీజన్లో ఎరువుల పంపిణీపై పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ప్రతినిధులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని సహకార సంఘాల అధికారులు, ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ప్రతినిధులతో ఎరువుల సరఫరాపై జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ జిల్లాలో రాబోయే ఖరీఫ్ సీజన్ కు అవసరమైన ఎరువులు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి కొరతా లేదన్నారు. అన్ని సమాకార సంఘములు వచ్చే ఖరీఫ్ సీజన్ కు ఎరువులను రైతల అవసరాలమేరకు సరఫరాల చేసేందుకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని అధికారులను ఆదేశించారు.
పిఏసిఎస్ పరిధిలో అవసరమైన ఎరువుల నిల్వలను ముందుగానే గుర్తించాలన్నారు. వారం రోజులకు సరిపడా ఎరువుల నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని, ఎరువులు దొరకలేదని రైతులు ఆందోళన చేసే పరిస్థితి జిల్లాలో ఎక్కడా తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా సమస్య వస్తుందని ముందుగానే గుర్తించి అధికారులకు తెలియజేయాలన్నారు. తగిన ప్రణాళికలతో ఎప్పటికప్పుడు వ్యవసాయ సహాకార పరపతి సంఘాలతోను, ప్రైవేట్ డీలర్స్ తోను, మార్క్ ఫెడ్ తో సమన్వయం చేసుకుని రైతులకు యూరియాను ముందస్తుగా ఆయా సంస్థలలో అందుబాటులో ఉంచాలని అధికారులను జయింట్ కలెక్టర్ ఆదేశించారు,
జిల్లా సహకార అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.