Close

బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలో బడిబయట పిల్లలను బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ కు తెలియజేసారు.

Publish Date : 02/05/2026

ఏలూరు, మే, 2 : బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలో బడిబయట పిల్లలను బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ కు తెలియజేసారు. బడి పిలుస్తోంది, ఎస్ఎస్సి పరీక్షలలో ఉతీర్ణులుకాని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్ధత, తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లతో విద్యా శాఖ కార్యదర్శి శనివారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ అంగన్వాడీ లలో ప్రీ స్కూల్ లో ఉన్న పిల్లలను మొదటి తరగతి లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బడి మానివేసిన వారిని తిరిగి బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఎస్సి పరీక్షలలో ఉతీర్ణులుకాని విద్యార్థులకు రెమిడీయల్ క్లాసులు నిర్వహించి సప్లీమెంటరీ పరీక్షలకు సంసిద్దులను చేసి ఉతీర్ణులు అయ్యేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీలలో ప్రీ స్కూల్ చదువుతున్న 20 వేల 949 మంది పిల్లలను మొదటి తరగతిలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టి బడి ఈడు పిల్లలు బడిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఎస్ఎస్సి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలల్లోని 4130 మంది ఫెయిల్ అయ్యారని, వారికి రెమిడీయల్ క్లాసులు నిర్వహించి సప్లీమెంటరీ పరీక్షలలో ఉతీర్ణులు అయ్యాలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారన్నారు.