బలేరామలింగేశ్వరస్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించేందుకు మంగళవారం బలివే ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కు ఆలయ ఈవో, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో, మంత్రోచ్చరణతో స్వాగతం పలికారు.
Publish Date : 18/02/2025
ఏలూరు/ముసునూరు,ఫిబ్రవరి,18: బలేరామలింగేశ్వరస్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించేందుకు మంగళవారం బలివే ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కు ఆలయ ఈవో, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో, మంత్రోచ్చరణతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కు అంతరాలయంలో స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలను కలెక్టరు కు అందించారు.
నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమీషనరు రంగారావు, దేవస్ధానం ఈవో పామర్తి సీతారామయ్య, తహశీల్దారు కె. రాజ్ కుమార్, యంపిడివో జి. రాణి, తదితరులు పాల్గొన్నారు.