Close

భారత జనగణన – 2027కు జిల్లాలో సన్నాహక చర్యలు ప్రారంభం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు సెన్సస్ అధికారులు నియామకం.

Publish Date : 13/01/2026

భారత జనగణన –2027 నిర్వహణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి తెలిపారు.

మంగళవారం న్యూ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ డైరెక్టరు ఆఫ్ సెన్సెస్ జె.నివాస్ పాల్గొనగా, అమరావతి నుంచి సర్వీసెస్ ప్రత్యేక చీఫ్ కార్యదర్శి శ్రీ ఎస్.కె.రావత్ పాల్గొని జిల్లా కలెక్టర్లుకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జనగణన–2027కు జిల్లాలో అధికార యంత్రాంగం సిద్ధం చెయ్యడం జరుగుతుంది అని తెలియ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేస్తూ జనగణన – 2027ను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఛార్జ్ సెన్సస్ ఆఫీసర్లుగా మున్సిపల్ కమిషనర్లను, గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్లను నియమించనున్నట్లు వివరించారు. జిల్లా, ఉప విభాగ, మండల, పట్టణ స్థాయిల్లో సెన్సస్ అధికారులుగా వివిధ శాఖల అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని జిల్లా కలెక్టరు పేర్కొన్నారు.పోలవరం సంబంధించిన కొన్ని గ్రామాలు, ఆర్&ఆర్ కాలనీలో ఉన్న ఇబ్బందులను గైడ్లైన్స్ ప్రకారం ప్లాన్ చేసుకుని జనాభా లెక్కలు మొదటివిడత కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారిలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న,ఆర్డీవోలు యం.అచ్యుత అంబరీష్, యం.వి. రమణ, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్లు, సంబంధిత అధికారులు వారివారి కార్యాలయంలు నుండి హాజరయ్యారు.