Close

భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం అమరావతి పర్యటన సందర్బంలో ఏలూరు జిల్లా నుంచి బయలుదేరిన ప్రజల సురక్షిత ప్రయాణానికి, తిరిగి వారిని గమ్యస్ధానాలకు తీసుకువెళ్లడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.

Publish Date : 02/05/2025

ఏలూరు,మే,2: భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం అమరావతి పర్యటన సందర్బంలో ఏలూరు జిల్లా నుంచి బయలుదేరిన ప్రజల సురక్షిత ప్రయాణానికి, తిరిగి వారిని గమ్యస్ధానాలకు తీసుకువెళ్లడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు కలెక్టర్ పర్యవేక్షించారు. జిల్లా నుంచి బయలుదేరిన 300 బస్సులు రాజధాని అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమానికి సురక్షితంగా చేరడం, జిల్లానుండి వెళ్లిన ప్రజలకు ఆహారం, త్రాగునీరు, తదితర ఏర్పాట్లను కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ ద్వారా కలెక్టర్ వెట్రిసెల్వి పర్యవేక్షించారు. కార్యక్రమానికి వెళ్లిన జిల్లా ప్రజలు తిరిగి వారి గమ్యస్ధానాలకు చేరేవరకు సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావుతోపాటు పోలీస్, రవాణా, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.