Close

భూముల రీ సర్వే పనులను సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.

Publish Date : 04/06/2026

లింగపాలెం/ ఏలూరు, జూన్, 4 : భూముల రీ సర్వే పనులను సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది చేస్తున్న రీ సర్వే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ రైతుల వివరాలను ఈ-కేవైసి చేసిన అనంతరం గ్రౌండ్ ట్రూతింగ్ రైతుల సమక్షంలో చేయాలన్నారు. ప్రజలకు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా రీ సర్వే పనులు చేపట్టాలన్నారు. రీ సర్వే భూవిస్తీర్ణంలో తేడాలు గుర్తించినట్లయితే వాటిపై రైతుల నుండి అందిన అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని నిబంధనల మేరకు వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

జాయింట్ కలెక్టర్ తో పాటు తహసీల్దార్ నజీముల్లాషా, సర్వే శాఖ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.