భూసేకరణకు భూములు అందించిన వారికి పరిహారం అందించండి పోలవరం ఆర్ అండ్ ఆర్ , జాతీయ రహదారుల భూసేకరణలపై అధికారులు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్
ఏలూరు, అక్టోబర్, 14 : జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ద్వారా భూములు అందించిన వారికి నిర్దేశించిన సమయంలోగా పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి మంగళవారం పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటునిమిత్తం భూ సేకరణ పై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు, తూర్పుగోదావరి, మన్యం జిల్లాలలోని పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిలో భాగంగా భూమికి భూమి, ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మాణాలు, తదితర పనులకు గాను ఏలూరు జిల్లాలో 4434 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటికే బుట్టాయిగూడెం,జీలుగుమిల్లి మండలాలలో గుర్తించిన భూములకు సంబంధించి ఇంకా సేకరణ చేయాలవసిన భూములకు సంబంధించి భూసేకరణ ప్రకటనలు వెంటనే జారీ చేయాలన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి ఎన్ .హెచ్. 165, గ్రీన్ ఫీల్డ్ హై వే , జీలుగుమిల్లి- పట్టిసీమ, ,పెడన-లక్ష్మీపురం 216-హెచ్ రహదారి, పట్టిసీమ-గూటాల రహదారుల భూసేకరణ పై జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబందించి కోర్ట్ లలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఏలూరు జిల్లాలో చేపట్టే భూసేకరణకు సంబంధిత శాఖల అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూసేకరణ కోసం భూమిని గుర్తించిన తర్వాత ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు
జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో లు యం.అచ్యుత అంబరీష్, రమణ, స్పెషల్ కలెక్టరు యస్.సరళ వందనం, అల్లూరి సీతారామరాజు, కలెక్టరేట్ భూసేకరణ విభాగ అధికారి పోతురాజు, జిల్లా భూసేకరణ అధికారులు, జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ,తదితరులు పాల్గొన్నారు.