మంజూరై ఇంకా ప్రారంబించని పనులను వెంటనే ప్రారంభించాలి జలధార-జలహారతి కార్యక్రమంపై అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్ష
ఏలూరు, జూన్, 3 : జిల్లాలో జలధార- జలహారతి కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల రీఛార్జ్ షాఫ్ట్ లు ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.. కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశమందిరంలో బుధవారం జలధార- జలహారతిలో పనుల ప్రగతిపై జిల్లా కలెక్టరు సమీక్ష అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాల మట్టాలు పెంచేందుకు జలధార-జలహారతి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో జిల్లాలో భూగర్భ జలాల రీఛార్జ్ షాఫ్ట్ లు ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి, వాటి ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. జిల్లాలో జలధార- జలహారతి కాల్వలు, చెరువులలో పూడికతీత పనులను సక్రమంగా చేపట్టి నీటినిల్వ సామర్థ్యం గతం కన్నా పెరిగేలా పనులు పూర్తి చేసినప్పుడే జలధార కార్యక్రమం ఉద్దేశ్యం నెరవేరుతుందని, అధికారులు ఆ దిశగా పనిచేయాలన్నారు. ఈనెల రెండవ వారం నుండి వర్షాలు ప్రారంభం కానున్న దృష్ట్యా, కురిసిన ప్రతీ నీటి బొట్టును పరిరక్షించుకునేందుకు పనులు త్వరితగతిన పూర్తి చెయ్యాలని అన్నారు. పనులు ప్రారంభించక ముందు, పనులు పురోగతిలో ఉన్నప్పుడు, పూర్తి ఐన తరవాత ఫోటోలు తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. మంజూరైన పనులలో ఇంకా ప్రారంభించని పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.
ఈ సమావేశంలో డ్వామా పిడి కె.వెంకట సుబ్బారావు, అదనపు పిడి రాజశేఖర్, భూగర్భ జల శాఖ డిడి కోదండరావు, , డ్వామా, ఇరిగేషన్ అధికారులు, ఎంపీడీఓలు, ఏపీవో లు, తదితరులు పాల్గొన్నారు.