మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు బాలికలను ఒక బాబుని

ఏలూరు,సెప్టెంబరు 02:మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు బాలికలను, ఒక బాబుని తెలంగాణ చెందిన రెండు కుటుంబాలకు అదే విధంగా బాలసదనం దెందులూరు నందు ఆశ్రయం పొందుతున్న ఒక పాపను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కి చెందిన దంపతులకు రెండు నెలల క్రితం పాస్టర్ కేర్ ఇవ్వటం జరిగినది, వారికి 60 రోజుల వారి వ్యక్తిగత కుటుంబ సర్దుబాట్లు అయిన తరువాత గౌరవ జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వారి చేతుల మీదుగా తుది దత్తత ధ్రువ పత్రములను మంగళవారం సదరు దంపతులకు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వారు సదరు దంపతులతో వివరంగా మాట్లాడి వారు దత్తత తీసుకున్న బాలలతో వారి యొక్క కుటుంబ జీవన విధానం వారి ఆహారపు అలవాట్లు విద్య ఇతర సౌకర్యాల కల్పన గురించి వివరాలు ఆరా తీశారు. ఇరువురు సంతృప్తిని వ్యక్తపరచిన తరువాత వారికి సదరు దత్తత బాలలు వారి సొంత బిడ్డలు గానే ధ్రువీకరించే విధంగా పత్రాలను అందించడం జరిగింది.
కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి పి. శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ .సూర్య చక్రవేణి, శిశు గృహ మేనేజర్ భార్గవి డిసిపియు సిబ్బంది పాల్గొన్నారు.