మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..
ఏలూరు,మార్చి, 17: ఎ.పి.మార్క్ ఫేడ్ మరియు నాఫేడ్ అధ్వర్యంలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో మినుములు, పెసలు(అపరాలు) కొనుగోలు కేంద్రాలు నేటి నుండి ప్రారంభిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెసలు కొరకు పెదపాడు, వట్లూరు, డిసిఎంఎస్ ఏలూరు, జాలిపూడి, దెందులూరు సొసైటీలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. మినుములు కొరకు లింగాల, దేవపూడి, తామరకొల్లు, డిసిఎంఎస్ ఏలూరు, దెందులూరు, డిసిఎంఎస్ అప్పన్నవీడు, పెదపాడు, వెంకటాపురం సొసైటీలలో కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. సిఎం యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి రైతు కూడా తమకు కేటాయించిన తేది ప్రకారం కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి తమ పంటను విక్రయించుకోవచ్చున్నారు. క్వింటా ప్రభుత్వం మద్దతు ధర పెసలు రూ. 8,682/- మరియు మినుములు రూ.7,400/- కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.
నాణ్యత ప్రమాణాల వివరములు..
ఇతర వ్యర్ధా పదార్ధాలు 2 శాతం, దెబ్బతిన్న పప్పదినుసులు గింజలు 3శాతం, కొద్దిగా దెబ్బతిన్న , రంగులేని పప్పదినుసు గింజలు 4శాతం, పక్వానికి రాని, ముడత/కుచించుకుపోయిన పప్పుదినుసులు గింజలు 3శాతం, ఇతర పప్పుదినుసు గింజలు 3 శాతం, పురుగు పట్టిన పప్పుదినుసు గింజలు 4శాతం, తేమ శాతం 12శాతం, రైతుల వద్ద నుండి మాత్రమే మద్దతు ధరపై కొనుగోళ్ళు చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందన్నారు. నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు కలిగిన పెసలు మరియు మినుములు మాత్రమే కొనుగోళ్ళు
నగదు రైతు బ్యాంకు ఖాతాకు నేరుగా చెల్లిస్తామన్నారు.
వివరాల కొరకు సంప్రదించవలసిన నంబర్లు: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శ్రీకాంత్, నెంబర్: 9100955934,
కంట్రోల్ రూమ్ నెంబర్: 7702003584, నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.