Close

మీతో కలిసి ప్రయాణం చేసాము, మీతో భోజనం చేసే అదృష్టం కలిగిందని జిల్లా కలెక్టరుకు కృతఙ్ఞతలు తెలియజేసిన దివ్యాంగులు .

Publish Date : 18/03/2026

ఏలూరు, మార్చి 18: జిల్లా కలెక్టరేటు వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం “దివ్యాంగ శక్తి” పథకం ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి దివ్యాంగులతో కలసి సహపంక్తి భోజనాన్ని చేశారు. భోజనం చేస్తూ దివ్యాంగులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు నోటు బుక్కులను జిల్లా కలెక్టరు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్హులు అయిన దివ్యాంగులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తామని అన్నారు. జిల్లాలో దివ్యంగులకు కేటాయించిన బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సదరన్ క్యాంపులను క్రమం తప్పకుండా నిర్వహించి అర్హులు అయిన వారికి గుర్తించి సదరన్ సర్టిఫికెట్స్ అందచేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తామని తెలిపారు. దివ్యాంగులు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత సంవత్సరం దివ్యాంగులు సంక్షేమం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సమాజంలో సమాన అవకాశాలు కల్పించి, సమాజంలో గౌరవంగా జీవించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు భరోసానిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, జిల్లా దివ్యాంగులు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్, ఏవో యన్.వి. నాంచారయ్య, జిల్లా దివ్యాంగులు సంక్షేమ సంఘం (ఏడియస్ యస్) ప్రెసిడెంటు మామిడిపల్లి నాగభూషణం, జిల్లా దివ్యాంగులు ఎంప్లాయిస్ ప్రెసిడెంటు జి.డి.వి.యస్. వీరభద్రరావు, దివ్యాంగులు నాయకులు, దివ్యాంగులు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.