Close

ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్, ఐ.జి., ఎస్పీ, ఎమ్మెల్యే లతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పార్థసారధి

Publish Date : 30/11/2025

ఉంగుటూరు మండలం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, డిఐజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు లతో కలిసి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఏర్పాట్లను పరిశీలించారు.

ఏలూరు/ఉంగుటూరు, నవంబరు 30: ఉంగుటూరు మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆదివారం సాయత్రం ఉంగుటూరు మండలం గొల్లగూడెం హెలిప్యాడ్, నల్లమాడు ప్రజావేదిక మరియు కేడరు సమావేశ సభాస్థలి, గోపినాథపట్నం యన్టీఆర్ బరోసా సామాజిక పింఛన్లు లబ్ధిదారులు గృహాలను, తదితర ప్రాంతాలను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, డిఐజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ముఖ్యమంత్రి కార్యాలయ భద్రతాధికారులతో కలిసి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకేసారి పింఛన్లు పెంపుదల చారిత్రాత్మక నిర్ణయం అని, ప్రతినెల ఒకటవ తేదీన రాష్ట్రంలో ఒక గ్రామం ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చెయ్యడం చంద్రబాబుకే సాధ్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందని అన్నారు. గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టిందని, పనిచేసే ప్రభుత్వానికి, పనిచెయ్యని ప్రభుత్వానికి తేడాను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఏ ఆదరణ లేక నిరాధారణకు గురైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పట్ల కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందన్నారు. గత ప్రభుత్వం హంగుఆర్భాటాలు, రంగులు మీద పెట్టిన శ్రద్ధ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై పెట్టలేదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుపేదలు ఇంటికి స్వయంగా వెళ్ళి పింఛన్లు సొమ్మును అందించి, వారి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయలేదని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేకపోయినా కూటమి ప్రభుత్వాన్ని దీవించిన అన్ని వర్గాలు ప్రజలకు మేలు చెయ్యాలనే ఉద్దేశంతోనే అభివృద్ధి, సంక్షేమ దిశగా రాష్ట్రానికి మంచి ప్రజాపాలన అందిస్తున్నామని తెలిపారు. రైతుకు ఒక్కసారి కోకో,పొగాకు, మొక్కజొన్న పంటలు సమస్యలు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారికి అన్ని విధాలుగా తోడుగా ఉందని అన్నారు. ప్రతి రైతుకు టర్పాలిన్లు అందించడం వలన పంట నష్టాలను కొంత మేర తగ్గించ గలిగామని అన్నారు. ఆరుగాలం శ్రమించిన పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర అందించి, 24 గంటల్లో డబ్బులను నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని అన్నారు. దేశంలోనే మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు.

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఉంగుటూరు మండలం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. . గోపినాథపట్నం యన్టీఆర్ బరోసా సామాజిక పింఛన్లు లబ్ధిదారులు గృహాలకు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని సిద్ధం చేశామని అన్నారు. పర్యటన పూర్తి అయ్యేంతవరకు వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక విధులు కేటాయించామని, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు.

శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో అత్యధిక పింఛను అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అని, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఇంటింటికి వెళ్ళి పింఛన్లు అందజేయటం ఏ ముఖ్యమంత్రి చెయ్యలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో రూ 130 కోట్లు అభివృద్ధి పనులు చేసుకున్నామని, ఆర్వోబి పనులు రూ 450 కోట్లు పూర్తి చేస్తామని అన్నారు. పీ4 కార్యక్రమం ద్వారా నియోజక వర్గంలో కాలువలు, బ్రిడ్జి నిర్మాణాలు, తదితర పనులు చేసుకున్నామన్నారు. జిల్లా ఇంచార్చి మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

ఏపీ అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జిల్లా మౌలిక సదుపాయాలు, ఆక్వా రైతులు, కొల్లేరు సమస్యలను దృష్టికి తీసుకొస్తామన్నారు. కూటమి ప్రభుత్వం మూడు పార్టీ నాయకులు కలిసికట్టుగా సంక్షేమం, అభివృద్ధి కృషి చేస్తున్నామని అన్నారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, ముఖ్యమంత్రి కార్యాలయ భద్రతా అధికారులు, ఏఎస్పీలు నక్కా పూర్ణ చంద్రరావు, ఆర్.సుస్మిత, మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీ రామకృష్ణ, ఏలూరు ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, డిఎస్పీ లు, జిల్లా, మండల వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.