మెడికల్ కళాశాల సీనియర్ హాస్టల్ బ్లాక్స్ నిర్మాణం కోసం స్ధల పరిశీలన..
Publish Date : 23/04/2025
ఏలూరు,ఏప్రిల్,23: ఏలూరు మెడికల్ కళాశాలకు అవసరమైన సీనియర్ హాస్టల్ బ్లాక్స్ నిర్మాణం కోసం స్ధల సేకరణకోసం బుధవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్ధల పరిశీలన చేశారు. మెడికల్ కాలేజీ అధికారులకు స్థలాన్ని అప్పగించడానికి సాధ్యాసాధ్యాలను ధృవీకరించడానికి స్ధానిక కలెక్టరేట్ సమీపంలోని సుమారు 1.55 సెంట్లు ఏటిగట్టు స్థలాన్ని ఆమె పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట తహశీల్దారు శేషగిరి, ఎపిఎంఎస్ఐడిసి ఈఈ రాంబాబు, తదితరులు ఉన్నారు.