• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

మెప్మా అధికారులు నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేయాలి- మెప్మా కార్యక్రమాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

Publish Date : 21/06/2025

ఏలూరు, జూన్, 21 : రాష్ట్రంలో లక్షమంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మెప్మా అధికారులను ఆదేశించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలపై మెప్మా అధికారులతో శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో నివసించే నిరుపేద మహిళల సామజిక, ఆర్ధిక అభివృద్ధికి మెప్మా తోడ్పాటు అందించాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాలలోని డ్వాకా సంఘాలను ఆర్ధికంగా మరింత బలోపేతం చేయడం ద్వారా మహిళల సాధికారత సాధ్యమవుతుందని, మెప్మా అధికారులు ఈ దిశగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా సంఘాలకు స్వయం ఉపాధి రుణాలు అందించి, ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటుచేయాలని, వాటికి ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడేలా మెప్మా సిబ్బంది కృషిచేయాలన్నారు. మహిళలను పారిశ్రామివేత్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి మెప్మా లోని టెక్నికల్ ఎక్స్పర్ట్స్, పరిశ్రమల శాఖ ద్వారా అవసరమైన సాంకేతిక సహకారాలను అందించాలన్నారు. ఏలూరు జిల్లాలో మెప్మా సిబ్బంది తమ పనితీరుని మెరుగుపరుచుకుని లక్ష్యాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలన్నారు. గత త్రైమాసికంలో లక్ష్యసాధన లోటును రెండవ త్రైమాసికంలో లక్ష్యాలతో కలిపి పూర్తిచేయాలని కలెక్టర్ మెప్మా అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో మెప్మా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.