మే,1వ తేదీన 2,56, 340 మంది పింఛనుదారులకు రూ.112.82 కోట్ల పంపిణీ-జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు, ఏప్రిల్, 30 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న NTR భరోసాపించను పధకము మే నెల పింఛను చెల్లింపులు మే, 1వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఏలూరు జిల్లా లో మే, 2026 నెలలో 2,56,340 మంది ఫించన్ దారులకు 112.82 కోట్ల రూపాయిలు పంపిణీ చేయడం జరుగుతుందని, . జిల్లావ్యాప్తంగా 1 వ తేదీన 100 శాతం పెన్షన్లు పంపిణీ చేయుటకు చర్యలు తీసుకొనటం జరిగిందన్నారు. . అనివార్య కారణంచే 1 వ తేదీన తీసుకోని వారికి 2వ తేదీ న పంపిణీ చేయబడునని, జిల్లా లో 4996 మంధి సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది తో ఫించనల పంపిణీకి ఏర్పాటు చేశామన్నారు.
పింఛను పొందేందుకు పింఛను దారులు వారి సంబంధిత ఇళ్లలో అందుబాటులో ఉండేలా ముందస్తు సమాచారంను సచివాలయ సిబ్బంది ద్వారా అందించి మే,1వ తేదీ ఉదయం 7 గంటల నుండి పించను పంపిణి జరిగే విధముగా చర్యలు తిసుకోవలసినదిగా డిఆర్డిఏ పీడీ విజయలక్ష్మిని కలెక్టర్ ఆదేశించారు.