Close

యోగాంధ్ర-2026 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని విద్యార్థుల భాగస్వామ్యంతో ఈనెల 17వ తేదీన ఏలూరు లో ప్రత్యేకంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ చెప్పారు.

Publish Date : 16/06/2026

ఏలూరు, జూన్, 16 : యోగాంధ్ర-2026 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని విద్యార్థుల భాగస్వామ్యంతో ఈనెల 17వ తేదీన ఏలూరు లో ప్రత్యేకంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ చెప్పారు. కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులతో జేసీ సమీక్షిస్తూ యోగాంధ్ర-2026 కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో యోగా మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించే దిశగా కార్యక్రమం నిర్వహణ ఉండాలన్నారు. జిల్లాలోని విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్వహించే ప్రత్యేక యోగా కార్యక్రమం ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 17వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విద్యార్థులు అందరూ యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాఖల అధికారులందరూ సంబంధిత అధికారులందరూ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, సమన్వయంతో పనిచేసి కార్యక్రమం విజయవంతంగా జరిగేలా కృషిచేయాలన్నారు.

ఏలూరు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, డీపీఓ మల్లికార్జునరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ .భానుప్రతాప్, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, సమగ్రశిక్ష ఏపీసీ పంకజ్ కుమార్, జిల్లా ఆయుష్ అధికారి, ప్రభృతులు పాల్గొన్నారు.