రసాయనిక పరిశ్రమలలో విపత్తు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై ఈనెల 30వ తేదీన చింతలపూడిలో ఐఓసిఎల్ పైప్ లైన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
Publish Date : 27/04/2026
ఏలూరు, ఏప్రిల్, 27 : రసాయనిక పరిశ్రమలలో విపత్తు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై ఈనెల 30వ తేదీన చింతలపూడిలో ఐఓసిఎల్ పైప్ లైన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30వ తేదీన ప్రతీ జిల్లాలోనూ రసాయనిక పరిశ్రమలలో విపత్తు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించవలసిందిగా ఆదేశించిందన్నారు. ఈ మాక్ డ్రిల్ లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 28వ తేదీన ఏలూరు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో టేబుల్ టాప్ ఎక్సరసైజ్ నిర్వహించబడుతుందని, ఈ కార్యాలయంలో అధికారులందరూ పాల్గొనాలని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు.