Close

రసాయనిక పరిశ్రమలలో విపత్తు సమయంలో నష్ట నివారణకు సంబంధిత శాఖల అధికారులు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.

Publish Date : 28/04/2026

ఏలూరు, ఏప్రిల్, 28 : రసాయనిక పరిశ్రమలలో విపత్తు సమయంలో నష్ట నివారణకు సంబంధిత శాఖల అధికారులు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఈనెల 30వ తేదీన చింతలపూడిలో ఐఓసిఎల్ పైప్ లైన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహణకు సంబంధించి టేబుల్ టాప్ ఎక్సరసైజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రసాయనిక పరిశ్రమలలో విపత్తులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతోపాటు విపత్తు సమయంలో నష్టాలను నివారించడంతోపాటు ప్రాణ నష్టాలు నివారించడానికి తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30వ తేదీన ప్రతీ జిల్లాలోనూ రసాయనిక పరిశ్రమలలో విపత్తు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించవలసిందిగా ఆదేశించిందన్నారు. ఈ మాక్ డ్రిల్ లో సంబంధిత శాఖల అధికారులు తీసుకోవలసిన చర్యలపై తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈనెల 30వ తేదీన చింతలపూడిలోని ఐఓసిఎల్ పైప్ లైన్ వద్ద నిర్వహించే మాక్ డ్రిల్ లో సంబంధిత అధికారులు అందరూ తప్పనిసరిగా పాల్గొని, ఆ కార్యక్రమంలో తెలియజేసిన సూచనలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు చేయవలసిన విధులను కలెక్టర్ తెలియజేసారు.

జిల్లా ఫైర్ ఆఫీసర్ రత్నబాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ కృష్ణమూర్తి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాధ్ బాబు, డిఎంహెచ్ఓ డా.శోభ, పశుసంవర్ధక శాఖ డిడి డా. గోవిందరాజులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.