Close

రానున్న ఖరీఫ్ సీజన్లో దెందులూరు నియోజకవర్గంలోని రైతాంగానికి ఎరువులు, విత్తనాలకు ఎటువంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ ను కోరారు.

Publish Date : 25/05/2026

ఏలూరు, మే, 25 : రానున్న ఖరీఫ్ సీజన్లో దెందులూరు నియోజకవర్గంలోని రైతాంగానికి ఎరువులు, విత్తనాలకు ఎటువంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ ను కోరారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ని కలిసి దెందులూరు నియోజకవర్గంలోని పలు సమస్యలను జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ స్పందించి ఎమ్మెల్యే తెలియజేసిన సమస్యలపై వెంటనే పరిష్కార చర్యలను తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను జేసీ ఆదేశించారు.