Close

రానున్న గోదావరి పుష్కరాలకు జిల్లాలోని వివిధ శాఖలు చేపట్టే పనులకు సంబందించి సంబంధిత శాఖల రాష్ట్ర ఉన్నతాధికారులు మంజూరు చేసిన పనుల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Publish Date : 02/06/2026

ఏలూరు, జూన్, 2: రానున్న గోదావరి పుష్కరాలకు జిల్లాలోని వివిధ శాఖలు చేపట్టే పనులకు సంబందించి సంబంధిత శాఖల రాష్ట్ర ఉన్నతాధికారులు మంజూరు చేసిన పనుల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఏలూరు జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాలలో చేపట్టే పనుల ప్రతిపాదనలపై మంగళవారం అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంలోని స్నాన ఘట్టాలు, నది గట్లు పటిష్టం వంటి పనులతో పాటు విద్యుత్, రోడ్లు, పర్యాటకం, దేవాదాయ, ప్రజా రవాణా వ్యవస్థ, తదితర శాఖలకు సంబంధిత ఆయా శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు సమర్పించిన ప్రతిపాదనలలో ఆయా శాఖలు మంజూరు చేసిన పనులు, నిధులకు సంబందించిన సమాచారాన్ని వెంటనే సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న , రమణ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ట్రాన్స్కో ఎస్ఈ లు దేవప్రకాష్, రమేష్, బి.ఎం. అంబేద్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.