Close

రాష్ట్రంలో ఉచిత ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర గనుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు.

Publish Date : 15/11/2024

ఏలూరు, నవంబర్, 15: రాష్ట్రంలో ఉచిత ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర గనుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఉచిత ఇసుక విధానంపై సమీక్షించారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ కు ఏలూరు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ నదులకు ఆనుకొనివున్న గ్రామాల్లోని ప్రజల అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకువెళ్లడానికి మండలస్ధాయి అధికారి అనుమతులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇసుక కావాల్సినవారు సంబంధిత గ్రామ సచివాలయంలో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పక్కాగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘనకు గురికాకుండా నిఘా పెంచాలన్నారు. నవంబరు 19వ తేదీన మరుగుదొడ్ల దినోత్సవం నేపద్యంలో ఆరోజు నుంచి డిశంబరు 10వ తేదీ వరకు మరుగుదొడ్లు, పరిశుభ్రతపై ప్రజల్లో విస్త్రృతమైన అవగాహన కల్పించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకొని వారిని గ్రామ పంచాయితీ స్ధాయిలో గుర్తించి బహుమతులను ప్రకటించాలన్నారు.
సమావేశంలో జిల్లా పంచాయితీ అధికారి కె. అనురాధ, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ త్రినాధ్ బాబు పాల్గొన్నారు.