రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి జిల్లాలో ఈ నెల 15, 16 తేదీలు పర్యటనను విజయవంతం చెయ్యాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …
ఏలూరు, జూన్ 10: జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబర్లో బుధవారం ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ శ్రీ సోళ్ల బొజ్జిరెడ్డి పర్యటనను అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, విజయవంతం చెయ్యాలని సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ శ్రీ సోళ్ల బొజ్జిరెడ్డి మరియు ఐదు మంది కమిటీ సభ్యులు జిల్లాలో ఈ నెల 15,16 తేదీలు పర్యటనలు అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చెయ్యాలని అన్నారు.15 వ తేదీన జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం మండలాల్లో కమిషన్ చైర్మన్ పర్యటించే ప్రాంతాలు, నిర్వహించే సమావేశాలు, పరిశీలించే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చెయ్యాలని సూచించారు. పర్యటనలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా వసతి, రవాణా, భద్రత, సమావేశ వేదికలు తదితర అంశాలుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో అమలువుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని, శాఖలు వారీగా నివేదికలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే గిరిజనులు సమస్యలు, అవసరాలు, ప్రభుత్వ పథకాలు అమలు పురోగతిపై సమగ్ర వివరాలను కమిషన్ చైర్మన్కు అడిగినప్పుడు చెప్పేందుకు, పూర్తి నివేదికలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. పర్యటన జిల్లాకు ఎంతో ప్రాధాన్యమైనదని, అన్ని శాఖలు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చెయ్యాలని అన్నారు. ఒక్క చిన్న పొరపాటు జరిగినా శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.16వ తేదీన జిల్లా కలెక్టరేటులో జిల్లా వివిధ శాఖలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు.
ఈ సమావేశంలో ఐటిడిఏ పీవో కె.రాములు నాయక్, ట్రైబల్ వెల్ఫేరు డిడి పి.జగన్నాథరావు, డిఇ యం.శ్రీనివాసు, డివైఇవో ప్రసన్న కుమార్, సంబంధిత మండలాలు తహాశీల్దారులు, తదితరులు పాల్గొన్నారు.