Close

రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ను, మర్యాద పూర్వకంగా కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పూలమొక్కను అందజేశారు ..

Publish Date : 04/07/2026

ఏలూరు, జులై 04: జిల్లాకు ఒక్కరోజు పర్యటనకు శనివారం వచ్చిన రాష్ట్ర మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ను మర్యాద పూర్వకంగా కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పూలమొక్కను అందజేశారు. జిల్లా కలెక్టరుతో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏలూరు నగర మేయరు షేక్ నూర్జహాన్, జిల్లా జాయింటు కలెక్టరు యం. జె.అభిషేక్ గౌడ లు పుస్పగుచ్చాలు, పూలమొక్కలను అందించి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.లక్ష్మి ప్రసన్న, నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాప్, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన వాణిశివప్రసాదు, ఏయంసి ఛైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కో-ఆప్షన్ సభ్యులు యస్.యం.ఆర్. పెదబాబు, చోడే వెంకటరత్నం, వివిధ కార్పొరేటర్లు, మెప్మా పిడి యం.రాజబాబు, నగర పాలక సంస్థ ఇంజనీరింగు అధికారులు, తహశీల్దారు కె.గాయత్రీదేవి, జీవనోపాధి జిల్లా కో-ఆర్డినేటరు సి.హెచ్.మహాలక్ష్మి, నాగసాయి స్వయం సహాయక సంఘం సభ్యురాలు కొనే క్రాంతి, తదితరులు మంత్రికి ఘనస్వాగతం పలికిన వారిలో ఉన్నారు.