Close

రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశానికి శాఖలు వారీగా అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలు పురోగతిపై చక్కని ప్రజెంటేషన్ రూపొందించాలి. వివిధ శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశం

Publish Date : 09/09/2026

ఏలూరు, సెప్టెంబరు 09: జిల్లా కలెక్టరేటు గౌతమీసమావేశం మందిరంలో బుధవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ఈ నెల ( రేపటి నుండి) 10,11 తేదీలు జరిగే సమావేశానికి శాఖలు వారీగా పూర్తిస్థాయి నివేదికలు సాయంత్రానికి అందించాలని సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ పాల్గొన్నారు. వివిధ శాఖలు పరిధిలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలు, పురోగతిలో ఉన్న పనులు తదితర అంశాలుపై శాఖల వారీగా జిల్లా కలెక్టరు సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ఈ నెల ( రేపటి నుండి) 10,11 తేదీల్లో అమరావతి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరగనున్నదని అన్నారు. ఇప్పటివరకు సాధించిన ప్రగతి, రానున్న రోజుల్లో చేపట్టబోయే లక్ష్యాలు, మనకు కావసిన నిధులు శాఖలు వారీగా చక్కని ప్రజెంటేషన్, ఈ రోజు సాయంత్రానికి అందించాలని ఆదేశించామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు రోజులు సమావేశానికి ఏలూరు జిల్లా తరపున చక్కని ప్రజెంటేషన్ ఇవ్వడానికి దోహదపడుతుందని అన్నారు. ప్రతి శాఖకు సంబంధించిన తాజా వివరాలు, పురోగతి నివేదికలు, సాధించిన లక్ష్యాలు, పెండింగు అంశాలు తదితర సమాచారాన్ని ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకుని అందించాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు అమలులో ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వాటిని గుర్తించి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు తమ శాఖలకు సంబంధించిన అంశాలుపై పూర్తి అవగాహనతో, వాస్తవ గణాంకాలతో నివేదికలు సిద్ధం చెయ్యాలి అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాకు సంబంధించిన అంశాలను సమర్థవంతంగా వివరించేలా అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసి, మంచి ప్రజెంటేషన్ అందించాలని అన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అమలు తీరుపై ఖచ్చితమైన గణాంకాలతో కూడిన నివేదికలను పవర్ పాయింటు ప్రజెంటేషన్ (PPT) రూపంలో సిద్ధం చెయ్యాలని అన్నారు. ​ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలు పేదలు సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం, మౌళిక వసతులు కల్పన వంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు క్షేత్రస్థాయి పురోగతిని విజయగాథగా పొందుపరచాలని అన్నారు. ​లక్ష్యాలు సాధనలో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, నిధులు వినియోగం, లబ్ధిదారులకు అందిన ప్రయోజనాకు వివరాలను పక్కాగా పొందుపరచాలని అన్నారు. శాఖలు మధ్య సమన్వయ లోపం లేకుండా, ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా పూర్తిసమాచారాన్ని మరియొక సారి సరిచూసుకుని ప్రజెంటేషన్ అందించాలని అన్నారు.

ఈ సమావేశంలో ఇంచార్జి డిఆర్వో, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎల్.దేవకీదేవి, వివిధ శాఖలు అధికారులు పాల్గొన్నారు.